NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత వైద్య సేవలు

1 min read

– మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలు

కర్నూలు, న్యూస్​ నేడు: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు సీజీహెచ్‌ఎస్‌ పరిధిలోని లబ్ధిదారులకు మరింత సులభంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (CGHS)లో ఎంపానెల్ అయింది. ఈ ఎంపానెల్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్ ని కర్నూల్ ఎంపీ శ్రీ బస్తిపాటి నాగరాజు పంచలింగాల సమక్షంలో ఆవిష్కరించారు.సీజీహెచ్‌ఎస్‌ ఎంపానెల్‌మెంట్ ద్వారా అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మెడికవర్ హాస్పిటల్స్‌లో అందుబాటులో ఉన్న వివిధ మల్టీ-స్పెషాలిటీ వైద్య సేవలను నగదు రహిత (Cashless) విధానంలో పొందే అవకాశం కలుగుతుంది. ఈ సేవలు ఆసుపత్రిలోని సంబంధిత విభాగాలు, సీజీహెచ్‌ఎస్‌ నిబంధనలు మరియు అర్హతలకు అనుగుణంగా అందించబడతాయి. శ్రీ బస్తిపాటి నాగరాజు పంచలింగాల గారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు.మెడికవర్ హాస్పిటల్స్, కర్నూలుకు సీజీహెచ్‌ఎస్ ఎంపానెల్‌మెంట్ లభించడం ఎంతో సంతోషకరమైన విషయం. రాయలసీమలో సీజీహెచ్‌ఎస్ ఎంపానెల్‌మెంట్ పొందిన ఏకైక ఆసుపత్రిగా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం ద్వారా మెరుగైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలను అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. సీజీహెచ్‌ఎస్ నిబంధనలకు అనుగుణంగా నగదు రహిత వైద్య సేవలు అందించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్యం మరింత సులభతరం అవుతుంది. కర్నూలుతో పాటు రాయలసీమ ప్రాంతంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ ఎంపానెల్‌మెంట్ ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం.మెడికవర్ హాస్పిటల్స్ కర్నూల్ హెడ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. “సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్‌లో మెడికవర్ హాస్పిటల్స్ ఎంపానెల్ కావడం కర్నూల్‌కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపయోగకరమైన అవకాశం. అర్హత కలిగిన లబ్ధిదారులకు సీజీహెచ్‌ఎస్‌ నిబంధనలకు అనుగుణంగా నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు మా బృందం సిద్ధంగా ఉంది. వివిధ వైద్య విభాగాల్లో సమగ్ర సేవలను అందిస్తూ, రోగులకు సౌకర్యవంతమైన వైద్య అనుభవాన్ని కల్పించడమే మా లక్ష్యం” అని అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *