వాల్మీకి జయంతి కి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలి
1 min read
వాల్మీకి లను ఎస్టీ జాబితాలో చేర్చాలి
లేనిపక్షంలో స్థానిక సంస్థలు ఎన్నికల బహిష్కరణకు సిద్ధం కావాలి
వి ఆర్ ఎస్ ఎస్ అధ్యక్షులు పొదల నర సింహులు పిలుపు
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి :ఈ నెల 26 వ తేదిన జరిగే వాల్మీకి జయంతి వేడుకను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వ హించి ఐక్యతను చాటి చెప్పేందుకు సన్నద్ధం అవు తున్నట్లు వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు ప్రకటించారు. బుధవారం మదనపల్లె పట్టణం బేబీ వెల్కం హోం నందు వాల్మీకి శ్రేణులతో సమా వేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వాల్మీ కుల చిరకాల స్వప్నం ఎస్టి జాబితాతో చేర్చడం తో పాటు, వాల్మీకి జయంతి రోజున ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయిన ఇప్పటి వరకు వాల్మీకులకు ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు. ఈనెల 26న జరిగే వాల్మీకి జయంతి వేడుకలను అన్ని వాల్మీకి సంఘాలతో సమన్వయం చేసుకొని ఘనంగా నిర్వహించడంతో పాటు ఐక్యతను చాటి చెబుతూ ప్రభుత్వానికి తమ గలాన్ని వినిపిస్తా మని ప్రకటించారు. ఇప్పటికే గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు మహిళల నుంచి విద్యార్థి, యువత వరకు వాల్మీకి రిజర్వేషన్ సాదించు కోవడం పై చైతన్యం పెరిగిందని గుర్తుచేశారు. వాల్మీకి జయంతి రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్య క్రమం,వాల్మీకి మహర్షికి ప్రత్యేక పూజలు ప్రత్యేక చైతన్య కార్యక్ర మాలు నిర్వహించ నున్నామని, కావున వాల్మీకి కుటుంబ సభ్యు లంతా పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. అదే విధంగా వి ఆర్ ఎస్ ఎస్ రాష్ట్ర కోశాధి కారిగా డాక్టర్ దేవరింటి సుధాకర్, అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా మంజునాద్ లను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. అలాగే వారికి దుశ్యాలువ, గజమాలతో సన్మానించి, వాల్మీకి రిజర్వేషన్ సాధన కోసం, వాల్మీకి జాతి అభ్యు న్నతి కోసం కార్యోన్ముఖులు కావాలని ఆకాంక్షిం చారు.ఈ కార్య క్రమం లో నియోజ కవర్గ అధ్యక్షులు గౌరమ్మ, పట్టణ అధ్యక్షులు టి గాయత్రి, పట్టణ కార్యదర్శి తలారి గాయత్రి, మహిళా నాయకులు శోభానాయుడు, అరుణ వాల్మీకి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


