టీడీపీకి షాక్..వైసీపీలోకి చేరిక
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లానందికొట్కూరు పట్టణం మారుతి నగర్ కాలనీకి చెందిన గౌరు వెంకటరెడ్డి అనుచరుడు మాబాష తన అనుచరులతో కలిసి బుధవారం టీడీపీని వీడి వైసీపీ పార్టీలో చేరారు.గత 30 సంవత్సరాలుగా టీడీపీలో కొనసాగుతున్న మాబాష రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఆయనతో పాటు ప్రసాద్,రహీమ్, మహమ్మద్ బాష తదితరులతో కలిపి మొత్తం 15 కుటుంబాలు పార్టీలో చేరాయి.వీరందరికీ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో 26వ వార్డు ఎన్నికల కౌన్సిలర్ అభ్యర్థి సునీత కుమారి మరియు పట్టణ అధ్యక్షులు మన్సూర్ అహ్మద్,చరణ్,జబ్బార్,మ దు సూదన్ రెడ్డి,భాష మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


