NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సబ్సిడీ బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం – ధరల నీయంత్రనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:     బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం ధరలు అధికంగా పెరిగిన నేపద్యం లో  సామాన్య, పేద మరియు మధ్య తరగతి  కుటుంబాలకు  ఆర్థిక భారం పడకూడదని వుద్దేశ్యంతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వినియోగ దారులకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ  ధరకే అందించాలనే లక్ష్యంతో పౌర సరపరాల శాఖ ఆద్వర్యంలో  మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ద్వారా తక్కువ ధరకే బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిందని జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ నంద్యాల వారు తెలిపారు. నంద్యాల జిల్లాలోని నంద్యాల పట్టణం లో శ్రీనివాస నగర్ లోని Rythu బజార్ & నూనెపల్లి లోని వ్యవసాయ మార్కెట్ కమిటి నందు  సన్న బియ్య ప్రతేక కౌంటర్ లను ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో  ఈ ప్రతేక కౌంటర్ ల ద్వారా ధరణి  బ్రాండ్ పేరుతో బీపీటీ (BPT)  సన్న బియ్యం రకం కిలో రూ 49 రూపాయలు కు మరియు KNM/RNR కిలో రూ. 50 రూపాయలు చొప్పున 26 కిలోల బస్తా లలో  విక్రయిస్తున్నారని జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్ తెలిపారు. వినియోగ దారులు తప్పనిసరిగా రైస్ కార్డ్ మరియు ఆధార్ కార్డ్ తీసుకొని రావాలని  తెలిపారు.     ఈ సబ్సిడీ బియ్యం పథకం రైస్ కార్డ్ మరియు  ఆధార్  కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వర్తిస్తుందని తెలిపారు. బియ్యం కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు తమ ఆధార్ నంబరును తప్పనిసరిగా తెలియజేయాలని, ఒక ఆధార్ కార్డుకు నెలకు గరిష్టంగా 26  కిలోల బియ్యం మాత్రమే అందజేయబడుతుందని అన్నారు. ప్రజలకు అత్యంత నాణ్య మైన బియ్యాన్ని విక్రయించాలని వుద్దేశ్యం తో ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం పౌర సరపరాల శాఖ ఆద్వర్యంలో  మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ ద్వారా ధరల నీయంత్రనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం గా  చర్యలు చేపట్టడం జరిగింది అని తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *