సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి టీజీ భరత్
1 min read
పేద కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ – మంత్రి టీజీ భరత్
కర్నూలు,న్యూస్ నేడు: కర్నూలు నగరంలో అర్హులైన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సలు చేయించుకున్న పేద కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.కర్నూలులోని ఆయన కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. షేక్ అబ్దుల్లాకు రూ.69,595, మల్లెపోగు శ్యాంబాబుకు రూ.47,780, వెంకట మహేశ్కు రూ.32,786, షేక్ ఫాతిమాకు రూ.46,032, అర్ఫాత్ కు రూ.27,480, చిత్తమూరు రమాదేవికి రూ.15 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. మొత్తంగా రూ.17,23,673 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి టీజీ భరత్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడుకు, మంత్రి టీజీ భరత్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.


