ఆశీర్వదించండి చేనేత కార్మికులకు అండగా ఉంటా
1 min read
47వ వార్డు టిడిపి అభ్యర్థి రామిశెట్టి రెడ్డి కేశవులు వెల్లడి
కూటమి నాయకులతో కలిసి విస్తృత ప్రచారం
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : తనకు ఒక అవకాశం ఇస్తే చేనేత కార్మికులకు అండగా ఉంటానని 47వ కూటమి బలపరిచిన టిడిపి అభ్యర్థి రామిశెట్టి రెడ్డికేశవులు పేర్కొన్నారు. ఆదివారం వార్డు పరిధిలోని చౌడేశ్వరి నగర్ నందు కూటమి నాయకుల తో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వ హించారు.ఈ కార్యక్రమానికి కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ కుమార్ (చినబాబు) సోదరుడు గుండ్లపల్లి యోగేశ్వర్ బాబు (పెదబాబు), సీనియర్ నాయకులు మోడెం సిద్ధప్ప, రామిశెట్టి నీలకంఠ, కె.వి నాగరాజు, రామిశెట్టి కృష్ణ (కమలామర్రి), శిబ్యాల వేణు గోపాల్,రామిశెట్టి రెడ్డి శేఖర్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈ వార్డులో చేనేత కార్మికులు ఎక్కువగా నివసిస్తు న్నారన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగానికి అధిక ప్రాధాన్యత నిస్తోందన్నారు.గత వైసీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వంతుడైన రెడ్డి కేశవులను గెలిపిస్తే వార్డు అభివృద్ధి తోపాటు ప్రజా సమస్యలను పరిష్కరిస్తాడని స్పష్టం చేశారు. అనంతరం రెడ్డి కేశవులు మాట్లా డుతూ మా తండ్రి రామిశెట్టి కృష్ణ రాజకీయాల్లో కొనసాగుతున్నారని,ఆయన స్ఫూర్తితో తాను కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగానన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, నియో జకవర్గంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా అనేక అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ముఖ్యంగా మదనపల్లె జిల్లా ఏర్పాటు, కృష్ణా జలాలతో చెరు వులను నింపడం, పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పనకు ఎమ్మెల్యే కృషి అమోఘమని కొనియాడారు.త్వరలో జరుగబోవు మున్సిపల్ ఎన్నికల్లో 47వ వార్డు అభ్యర్థిగా నన్ను,చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.


