రాయచోటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బోనమలఏకగ్రీవం
1 min read
రాయచోటి మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిస్తా
తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు
రాయచోటి మున్సిపాలిటీ చైర్మన్ గా ఎంపికైన బోనమల ఖాదరవల్లి
అన్నమయ్య జిల్లా : ( సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) అన్నమయ్య జిల్లాలోని రాయచోటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా బోనమల ఖాదర్ వలీ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాయచోటి మున్సిపల్ కమిషనర్ చేతులమీదుగా డిక్లరేషన్ ఫారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పార్టీ అధిష్టానానికి పేరుపేరునా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల సమష్టి కృషితో ఈ ఎంపిక సాధ్యమైందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాయచోటి మున్సిపాలిటీ అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు. రాయచోటి మున్సిపాలిటీలు ముఖ్యంగా డ్రైనేజీ సిమెంట్ రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.



