NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా 10K రన్ నిర్వహణ

1 min read

జెండా ఊపి 10 కె రన్ ను ప్రారంభించిన…. అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా  

కర్నూలు, న్యూస్​ నేడు: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆదివారం కర్నూలులో 10K రన్ నిర్వహించారు.కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం  నుంచి ప్రారంభమైన ఈ 10K రన్ రాగమయూరి టెంపుల్, కరెంట్ ఆఫీస్ మీదుగా సాగి తిరిగి కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం కు చేరుకుంది.పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, పోలీసు సిబ్బందిలో శారీరక దృఢత్వం, ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం ఈ 10K రన్ ముఖ్య ఉద్దేశమని అడిషనల్ ఎస్పీ శ్రీ హుస్సేన్ పీరా  తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ  శ్రీ కృష్ణమోహన్, డీటీసీ డీఎస్పీ దుర్గాప్రసాద్, సీఐలు లక్ష్మయ్య, వెంకటకృష్ణారెడ్డి, ఆర్ఐ నారాయణ, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి , ఆర్ఎస్ఐలు, ట్రైనీ పోలీసులు, ఇతర పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *