శ్రీ సరస్వతీ శిశు మందిరంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
1 min read
వాల్మీకి జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించిన ఆచార్యులు
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిరంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానాచార్యులు కే. పార్వతి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆచార్యులు వాసు మహర్షి వాల్మీకి జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడని, తపస్సు ద్వారా మహర్షిగా ప్రసిద్ధి చెందారని తెలిపారు. ఆయన తపస్సు చేస్తున్న సమయంలో చుట్టూ పుట్టలు ఏర్పడగా, వాటి నుంచి బయటకు వచ్చినందున ‘వాల్మీకి’ అనే పేరు వచ్చిందని వివరించారు.మహర్షి వాల్మీకి సంస్కృతంలో రామాయణాన్ని రచించారని, ఈ మహాకావ్యంలో 24 వేల శ్లోకాలు, ఏడు కాండాలు ఉన్నాయని తెలిపారు. రామాయణం ద్వారా ధర్మం, సత్యం, ఆదర్శ జీవనం వంటి గొప్ప విలువలు తెలుస్తాయని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.



