మీ అందరి సహకారంతో శక్తివంచన లేకుండా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా
1 min read
18వ డివిజన్ జనసేన అభ్యర్థి లక్కిం శెట్టి సుస్మిత కిరణ్
ప్రచారంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు,అభిమానులు శ్రేయోభిలాషులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : 18వ డివిజన్ జనసేన పార్టీ బలపరిచిన కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా లక్కిం శెట్టి సుస్మిత కిరణ్ ప్రచారంలో కొనసాగుతున్నారు. స్థానిక డివిజన్ నుంచి పార్టీ శ్రేణులు కార్యకర్తలు,అభిమానులు, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో ప్రచారం కొనసాగిస్తూ, ఒక్కసారి అవకాశం ఇచ్చే గెలిపించాలని అభివృద్ధికి ఓటేయాలని డివిజన్ ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ18వ డివిజన్లో ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, వీధి దీపాలు,ఆహ్లాదకరమైన పార్కులు,సుంద్రీకరణ మైన రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. మాట్లాడుతూ జనసేన బలపరిచిన అభ్యర్థిగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో.ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)ప్రోత్సాహంతో డివిజన్ నుండి విజయం సాధించి కూటమి, పార్టీకి బహుమతిగా ఇస్తానని, మీ అందరి సహకారంతోనే డివిజన్ ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. అదేవిధంగా స్థానిక డివిజన్ లో తనకు మంచి ప్రోత్సాహం ఓటర్లు అందిస్తున్నారని ఓటర్ల సహకారంతోటే ఈ విజయాన్ని సాధిస్తానని భీమా వ్యక్తం చేశారు.


