NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదవేగిలో చింతమనేని నవ్యశ్రీ ఎన్నికల ప్రచార భేరీ

1 min read

కన్నాపురంలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టిన జనం.విజయతీరాల వైపు తొలి అడుగు

నవ్యశ్రీకి మంగళహారతులు పట్టి,దిష్టి తీసి ఆశీర్వదించిన గ్రామ మహిళలు

జెడ్పీటీసీ స్థానంతో పాటు స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని నవ్యశ్రీ విజ్ఞప్తి,

తండ్రి బాటలోనే ప్రజాసేవ 

ఏలూరుజిల్లాప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతమనేని సాయి నవ్యశ్రీ ఆదివారం సాయంత్రం తన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ఘనంగా పూరించారు. పెదవేగి మండలం కన్నాపురం గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించిన ఆమె గ్రామంలోని ప్రతి గడపకూ తిరుగుతూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పెదవేగి జెడ్పీటీసీగా తనను భారీ మెజారిటీతో గెలిపించడంతో పాటు, అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులందరినీ ఏకపక్షంగా ఆశీర్వదించాలని ఓటర్లను అభ్యర్థించారు.తండ్రి బాటలోనే ప్రజాసేవ  ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఉన్న అపార ప్రేమాభిమానాలను నవ్యశ్రీపై ప్రజలుచూపించారు.ఈ సందర్భంగా తమ అభిమాన నాయకుడు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీకి కన్నాపురం గ్రామ ప్రజలు, మహిళలు అపూర్వ రీతిలో బ్రహ్మరథం పట్టారు. ప్రతి ఇంటా తమ సొంత బిడ్డనే ఆహ్వానించినట్లు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతూ. మంగళహారతులు పట్టి, నుదుట కుంకుమ దిద్ది సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రజలు చూపించిన అంతులేని వాత్సల్యంతో తొలిరోజే ప్రచార పర్వం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఏఎంసీ మార్కెట్ చైర్పర్సన్ గారపాటి రామసీత, మండల పార్టీ అధ్యక్షులు ఈడుపుగంటి అనిల్ సహా పలువురు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు,గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *