NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుంద అభివృద్ధే లక్ష్యం – ప్రజాసేవే ధ్యేయం!

1 min read

హొళగుంద MPTC–01 అభ్యర్థిగా ఎఫ్. మెహ్రూన్నిసా

ప్రతి వార్డులో స్వచ్ఛత.. ప్రతి ఇంటికి సంక్షేమం.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత

ఎస్‌డీపీఐకి ఓటు వేయండి – మార్పుకు మద్దతు ఇవ్వండి

హొళగుంద న్యూస్ నేడు: మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ఎస్‌డీపీఐ తరఫున హొళగుంద MPTC–01 అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎఫ్. మెహ్రూన్నిసా (భర్త ఎఫ్. హమీద్)కు ఓటు వేసి గెలిపించాలని ఓటరు మహాశయులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని అభ్యర్థి తరఫున తెలియజేశారు.

ప్రజా సేవే మా లక్ష్యం

హొళగుంద ప్రాంత అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తూ, ప్రతి వార్డులో స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

మార్పు కోసం ఎస్‌డీపీఐకి మద్దతు ఇవ్వండి

“మన అడుగు మార్పు వైపు.. మన ప్రయాణం న్యాయం వైపు.. ప్రజల సమస్యలే నా లక్ష్యం.. ప్రజాసేవే నా ధ్యేయం” అనే నినాదంతో ప్రజల ముందుకు వస్తున్న ఎఫ్. మెహ్రూన్నిసాను MPTC–01 అభ్యర్థిగా గెలిపించాలని కోరారు.

హొళగుందలో అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తామని తెలిపారు. కాబట్టి ఓటరు మహాశయులు ఎస్‌డీపీఐ అభ్యర్థి ఎఫ్. మెహ్రూన్నిసాకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి, హొళగుంద అభివృద్ధికి బాటలు వేయాలని విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *