NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఫిలిం మేకింగ్ డిప్లొమాలో ప్రధమ శ్రేణి సాధించిన పి. హాసేన్ బాషా (తారక్)!

1 min read

హొళగుంద మండల ఎంఈఓ-2 పి. కబీర్ సాబ్ కుమారుడికి అభినందనల వెల్లువ

హోళగుంద న్యూస్ నేడు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహించిన డిప్లొమా ఇన్ ఫిలిం మేకింగ్ కోర్సులో హొళగుంద మండల ఎంఈఓ-2 పి. కబీర్ సాబ్ కుమారుడు పి. హాసేన్ బాషా (తారక్) ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ప్రతిభ చాటుకున్నారు.ఫిలిం మేకింగ్ రంగంపై ఆసక్తి, పట్టుదలతో చదువును కొనసాగిస్తూ ఈ విజయాన్ని అందుకోవడం పట్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విద్యతో పాటు సృజనాత్మక రంగంలోనూ తన ప్రతిభను నిరూపించుకున్న తారక్‌ను పలువురు అభినందిస్తున్నారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో సినీ రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. తన ప్రతిభతో మరిన్ని విజయాలు సాధించి కుటుంబానికి, హొళగుంద మండలానికి మంచి పేరు తీసుకురావాలని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *