NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారం హనుమంతరావు (అను) ఘన విజయం

1 min read

ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి గడపగడపకు వెళ్లి కృతజ్ఞతలు

తీన్మార్ డప్పులతో విజయోత్స ర్యాలీ,పెద్ద ఎత్తున పాల్గొన్న డివిజన్ ప్రజలు,అభిమానులు, శ్రేయోభిలాషులు 

 స్వీట్స్ తినిపించి,హారతులిచ్చి ఆశీర్వదించిన డివిజన్ ప్రజలు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారం హనుమంతరావు (అను) 16వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా సైకిల్ గుర్తుపై పోటీ చేసి 1,087 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించారు.దీనిలో భాగంగా మారం హనుమంతరావు  డివిజన్ ప్రజలతో, అభిమానులతో శ్రేయోభిలాషులతో విజయోత్సవ ర్యాలీ తీన్మార్ డప్పులతో డివిజన్ అంతటా గడపగడపకు కలియతిరిగి ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనుకు 16వ డివిజన్ ప్రజలు ఓటేసి గెలిపించుకున్న కార్పొరేటర్ కు పూలదండలు వేసి,శాలువాలు కప్పి,  హారతిలిచ్చి ఆశీర్వదించి, స్వీట్స్ తినిపించి,ఫ్రూట్స్ ను తమ అభిమాన కార్పొరేటర్ కు అందించారు. ఈ సందర్భంగా అను మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య చంటి ఆశీస్సులతో ఈ డివిజన్ నుంచి పోటీ చేసి విజయం సాధించాను అన్నారు. ఆయన ప్రోత్సాహం డివిజన్ ప్రజల ఆశీస్సులు  నన్ను విజయం వైపు నడిపించాయి అన్నారు. అమ్మానాన్న ట్రస్ట్ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా ఏలూరు నగరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానన్నారు. డివిజన్ లో ప్రతి ఒక్కరికి  సుపరిచితులమని,పిన్న వయసులో నన్ను ఆశీర్వదించినందుకు ఎంతో రుణపడి ఉంటామన్నారు.మి సేవకుడిగా పనిచేసే అదృష్టం మీరు నాకు కల్పించినందుకు. మీరంతా అండగా ఉండి ఓటేసి గెలిపించినందుకు ఎంతో  కృతజ్ఞుడినై  ఉంటానన్నారు. మీ అండదండలు అభిమానం  ఉన్నందుకు ఆనందిస్తున్నఅన్నారు.డివిజన్ లో అన్ని  సమస్యపై స్పందించి  ప్రజల అవసరాలనుగుర్తించి. త్వరగా పూర్తిచేసి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. మారం హనుమంతరావు (అను)  వెంట పెద్ద ఎత్తున డివిజన్ ప్రజలు,మహిళలు  పాల్గొని భారీ కేక్ కట్ చేసి ఒకరినొకరు ఆనందంగా పంచుకొన్నారు.డివిజన్ అభివృద్ధికి 10 సంవత్సర  కాలాలపాటు అభివృద్ధికి సహకరించాలని స్థానిక ప్రజలు కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *