బావిశెట్టివారి పేట భూలోకమ్మ అమ్మవారి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన
1 min read
ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
అన్నదాన కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు, మేయర్,కార్పొరేటర్లు,డివిజన్ ప్రజలు
ఏలూరు జిల్లా ప్రతినిధి ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక బావిశెట్టి వారి పేట నందు వేంచేసియున్న శ్రీ భూలోకమ్మ అమ్మవారి ఆలయం నందు ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగాఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి)హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కి ఘనంగా స్వాగతం పలికి పూల బొకే అందించి శాలువా కప్పి సత్కరించారు. ప్రతి ఏటా వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. భూలోకమ్మ ఆశీస్సులతోనే ఏలూరు నగర ప్రజలు, బావిశెట్టి వారి పేట డివిజన్ ప్రజలు ఆయురారోగ్య సుఖసంతోషాలతో కుటుంబాలు సంతోషంగా విరాజిల్లుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే తోపాటు ఏలూరు నగర మేయర్ రెడ్డి అప్పలనాయుడు, ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,3వ డివిజన్ కార్పొరేటర్ మేకల కనకదుర్గ, 2వ డివిజన్ కార్పొరేటర్ అమరావతి అశోక్, భూలోకమ్మ గుడి కమిటీ సభ్యులు చందు,మేకల సీతారామయ్య ,బావిశెట్టి నందకుమార్,పల్లి శ్రీనివాసరావు,పల్లంట్ల శ్రీనివాసరావు,నాగులపల్లి గంగాధరావు, వాళ్ళ శ్రీనివాసరావు,వెంపల అనిల్,శంకాబత్తుల రమేష్ ,లంకలపల్లి సతీష్, శంకాబత్తుల నాగరాజు, మాజీ విప్ గూడవల్లి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



