NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దోమల నివారణకు దోమతెరల వినియోగం తప్పనిసరి!

1 min read

కస్తూరిబా గురుకుల పాఠశాల విద్యార్థినులకు 94 దోమతెరల పంపిణీ

ప్యాపిలి న్యూస్ నేడు: జిల్లా మలేరియా అధికారి ఆదేశాల మేరకు ప్యాపిలి పట్టణంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులకు 94 ఎల్‌ఎల్‌ఐఎన్‌ఎస్‌ దోమతెరలను ప్యాపిలి వైద్యాధికారి డాక్టర్ రాహుల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దోమతెరలు వినియోగించాలని సూచించారు. అంతేకాకుండా నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలించి శుభ్రపరచాలని, నీటి తొట్టెలు, పాత్రలకు మూతలు ఉంచాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తద్వారా దోమల వృద్ధిని అరికట్టి వ్యాధుల వ్యాప్తిని నియంత్రించవచ్చని విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అనంతరం డాక్టర్ రాహుల్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి రాఘవేంద్ర గౌడ్ సుస్థిర జీవనశైలి (బ్రిక్స్) కార్యక్రమంలో భాగంగా ఏడు అంశాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఇంధనాన్ని ఆదా చేయడం, నీటిని పొదుపు చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, సుస్థిర ఆహార విధానాలను పాటించడం, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, వ్యర్థాలను తగ్గించడం, ఈ-వ్యర్థాల నియంత్రణ వంటి అంశాలను వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థినులతో సుస్థిర జీవనశైలి ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ రాజారావు, పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు ప్రియాంక, అధ్యాపకులు, హెల్త్ అసిస్టెంట్ నారాయణస్వామి, ఏఎన్‌ఎం రమాదేవి, ఆశా కార్యకర్త మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *