జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ లో ప్యారా లీగల్ వాలంటీర్ల ఎంపిక “
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి గారు మరియు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ లు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కర్నూల్ నందు ప్యారా లీగల్ వాలంటీర్లుగా పనిచేయుటకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేశారు. ఇలా ఎంపికైన ప్యారా లీగల్ వాలంటీర్ లకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు చట్టపరమైన శిక్షణను ఇస్తారని తెలిపారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న ప్యారా లీగల్ వాలంటీర్స్ వారి వారి గ్రామాలలో ప్రజలకు చట్టాలపై అవగాహన కలిగించి ప్రజల యొక్క చట్టపరమైన సమస్యలను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ దృష్టికి తీసుకువచ్చి వారి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని తెలిపారు. ఈ ప్యారా లీగల్ వాలంటీర్స్ ప్రజలకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థకు వారధిగా పనిచేస్తారని తెలిపారు.


