జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి సర్వం సిద్ధం
1 min read
మూడు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాలు
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్
మదనపల్లె , ( బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి ) : జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. ఇందు లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మూడు రెవెన్యూ డివిజన్లలో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని మదనపల్లి, నిమ్మన పల్లి, రామస ముద్రం, తంబళ్లప ల్లి, పెద్దమండ్యం, మొలకల చెరువు, పిటిఎం, బీ.కొత్త కోట, కురబలకోట, పుంగనూరు, చౌడేపల్లి మండలా లకు సంబంధించి, మదనపల్లె లోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రాయచోటి రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిన్నమండెం, గాలి వీడు, సంబేపల్లి మండలాలకు సంబంధించి మాసా పేట లోని పాత ఎస్పీ బంగ్లా నందు కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
డివిజన్ వారిగా కౌంటింగ్ హాల్స్, కౌంటింగ్ కు కేటాయించిన అధికారులు, సిబ్బంది వివరాలు
మదనపల్లి 299,రాయచోటి 217,పీలేరు 123.కౌంటింగ్ హాల్స్మదనపల్లి – 11,రాయచోటి – 03,
పీలేరు – 08.కౌంటింగ్ స్టాఫ్ ఫర్ టేబుల్ – కౌంటింగ్ సూపర్వైజర్ -1కౌంటింగ్ అసిస్టెంట్ -2, వీడియో గ్రాఫర్ -1.జిల్లాలో మొత్తం మండలాలు: 25ఎన్నికలు జరిగిన మండలాలు: 22జిల్లాలో జెడ్పిటిసి స్థానాలు: 25 ఉండగా 22 జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి.ఎంపిటిసి స్థానాలు: 321 కాగా 147 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.మొత్తం పోలింగ్ కేంద్రాలు: 1002
మొత్తం ఓటర్లు: 8,28,651.జెడ్పిటిసి అభ్యర్థులు: 91ఎంపిటిసి అభ్యర్థులు: 386
మొత్తం అభ్యర్థులు: 477. ఈనెల 5న పోలింగ్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ పెట్టెలను కట్టు దిట్టమైన భద్రత మధ్య ఆయా కేంద్రాలకు తరలించి, స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరిగింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా నిబంధనల ప్రకారం నిర్వహిం చేందుకు అవసర మైన చర్యలు చేపట్టారు. ఓట్ల లెక్కింపు నిర్వ హణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు సజావుగా పూర్తి చేయాలని, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.


