కూటమి ధర్మంలో బీజేపీకి సముచిత స్థానం కల్పించాలి !
1 min read
మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి బీజేపీకే కేటా యించాలి
వైస్ చైర్మన్ పదవికి ఎల్లంపల్లి ప్రశాంత్ అర్హుడు
మదనపల్లె నవంబర్ 6, న్యూస్ నేడు ప్రతినిది : మదనపల్లె మున్సి పాలిటీ లో వైస్ చైర్మన్ పదవి ఎవరి కి దక్కనుందనే అంశం కూటమి పార్టీల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. మున్సి పల్ ఎన్నికల్లో కూటమి విజ యానికి మూడు పార్టీలు తమ వంతు కృషి చేసిన నేపథ్యంలో, పదవుల కేటా యింపు లోనూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ అన్ని పార్టీలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.ఇప్పటికే వ్యవ సాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ పదవిని జనసేనకు, మున్సి పల్ చైర్మన్ పదవిని తెలుగుదేశం పార్టీకి కేటా యించగా, మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని భారతీయ జనతా పార్టీకి కేటాయించా లని బీజేపీ శ్రేణులు కోరు తున్నాయి. కూటమిలో భాగ స్వామిగా ఉన్న బీజేపీకి కూడా కీలక పదవిలో అవకాశం కల్పించడం ద్వారా మూడు పార్టీల మధ్య సమన్వ యం, పరస్పర గౌరవం మరింత బలపడు తుందని వారు అభిప్రాయ పడుతున్నారు.ముఖ్యం గా వైస్ చైర్మన్ పదవికి వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఎల్లంపల్లి ప్రశాంత్ పేరు ప్రముఖంగా విని పిస్తోంది. ఈ నేపథ్యంలో కూటమి ముఖ్య నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, వైస్ చైర్మన్ పదవి ఎవరిని వరిస్తుందో నన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.


