NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“రెడ్యూస్ వేస్ట్” (వ్యర్థాల తగ్గింపు) అనే అంశంపై ప్రత్యేక అవగాహన

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు  ఆదేశాల మేరకు, ఆసుపత్రిలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న “బ్రిక్స్ సస్టైనబుల్  లైఫ్ స్టైల్  వీక్” ముగింపు సందర్భంగా నేడు “రెడ్యూస్ వేస్ట్” (వ్యర్థాల తగ్గింపు) అనే అంశంపై చివరి రోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా వ్యర్థాల పునర్వినియోగం మరియు పునరుత్పత్తి విధానాలపై అవగాహన కల్పిస్తూ నర్సింగ్ విద్యార్థులతో కలిసి ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేక అవగాహన ర్యాలీని నిర్వహించారు. అలాగే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే మంచి అలవాట్లపై సిబ్బందికి, ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరచి చక్కగా చిత్రాలు వేసిన విజేతలకు బహుమతులు అందజేశారు.స్టాఫ్ నర్సులు టి. సంపత్ కుమార్, డి. అర్షద్ బాషా ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సి.ఎస్.ఆర్.యం.ఓ డా పి.పద్మజ , డిప్యూటీ సి.ఎస్.ఆర్.యం.ఓ వి.పద్మజ , అసిస్టెంట్ ప్రొఫెసర్ డా యం.వి కిరణ్ కుమార్ , నర్సింగ్ విద్యార్థులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *