NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

​”శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి విరాళం”

1 min read

ఇంద్రకీలాద్రి, న్యూస్​ నేడు: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో నిరంతరం కొనసాగే అన్నప్రసాద వితరణ పథకానికి (అన్నదానం ట్రస్ట్) శనివారం ఉదయం భక్తులు  విరాళాన్ని అందజేశారు.  విజయవాడ అయోధ్యానగర్‌కు చెందిన  శనగపల్లి ధాన్య రత్న మాధురి  శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన ట్రస్ట్‌ కొరకు రూ. 1,01,116/- (అక్షరాలా ఒక లక్షా ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు) మొత్తాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (అయోధ్యానగర్ బ్రాంచ్) చెక్కు రూపంలో దేవస్థానంలో అందజేశారు.  అన్నదాన ట్రస్ట్‌కు విరాళం అందించిన దాత కుటుంబ సభ్యులకు ఆలయ మర్యాదలతో శ్రీ అమ్మవారి దర్శన ఏర్పాట్లు కల్పించి, అనంతరం వేద పండితులచే ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేసి, ఏఈవో రమేష్ బాబు చిత్రపటం అందజేశారు.

​జారీ చేసిన వారు:

ప్రజా సంబంధాల అధికారి, శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *