అమరుడు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి ఆశయాలను కొనసాగిస్తాం
1 min read
వెలుగోడు, న్యూస్ నేడు: భారత విప్లొద్యమ నిర్మాత ప్రతిఘట పోరాట యోధుడు అమరుడు కామ్రేడ్ చం డ్ర పుల్లారెడ్డి గారి 42వ వర్ధంతి సందర్భంగా వెలుగోడు మండల కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి. కామ్రేడ్ సుబ్బారెడ్డి గార్ల స్థూపాలకు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నంద్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గజమానులు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అనంతరం అఖిల భారత రైతు కూలి సంఘం మండల కార్యాలయంఆవరణంలో కామ్రేడ్ చం డ్ర పుల్లారెడ్డి గారి 42వ వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు అఖిలభారత రైతుకూలీ సంఘం మండల అధ్యక్షులు నందివర్గం విజయ్ అధ్యక్షతన జరిగింది .ఈ సభను ఉద్దేశిస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ భూమి కోసం. భుక్తి కోసం. భారతదేశ విముక్తి కోసం ఎందరో విప్లవ అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను ప్రజల కోసం అర్పించడం జరిగింది. అందులో ఎక్కువ శాతం నవంబర్ మాసంలో విప్లొద్యమ నాయకులు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ వారి ఆశయాలు నెరవేర్చడం కొరకు నవంబర్ నెల ఒకటో నుండి 9వ తేదీ వరకు అమరవీరుల సంస్మరణ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు .కామ్రేడ్ చం డ్ర పుల్లారెడ్డి గారు నవంబర్ 9న అమరులైనందున ఆయన మరణించి 42 సంవత్సరాలు పూర్తయినందువల్ల ఇక్కడ సభ నిర్వహించడం అర్శించదగ్గ విషయం అన్నారు . ప్రతిఘటన పోరాట నిర్మాత భారత విప్లొద్యమ అగ్ర నాయకులు కామ్రేడ్ చం డ్రపుల్లారెడ్డి 1984 నవంబర్ 9వ తేదీన అమరులయ్యారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకు పోవాల్సిన ఆవక్షత మన పైన ఉందన్నారు. ఆయన పుట్టిన వెలుగోడు గ్రామంలో భూమిలేని పేదలు ఇంటి స్థలాలు లేని పేదలు దుర్భర జీవితంలో అనుభవిస్తున్న వారికి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నప్పటికీ ఎటువంటి చర్య తీసుకుపోవడం దుర్మార్గం అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి పై ఒత్తిడి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం అన్నారు కావున నాటి చం డ్ర పుల్లారెడ్డి ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మరియు కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా ఉండి పోరాడినప్పుడే అమరులకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కే ఆనందరావు .జిల్లా కోశాధికారి లాలూ నాయక్ .జిల్లా నాయకులు ఆర్ శివ. మండల నాయకులు వడ్ల హుస్సేన్ భాష. రుద్ర వేణి .నాగ స్వామి నాయక్. టి శివమ్మ .అత్త రున్ని సా .పార్వతమ్మ .కళ్యాణి బాయ్ .లోకేశ్వరి బాయ్. లక్ష్మీబాయి . వెంకటేశ్వర్లు భాయ్ .నారాయణమ్మ వీరుతోపాటు 150 మంది ప్రజలు పాల్గొన్నారు.


