NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

10న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 రాష్ట్ర జట్ల ఎంపికలు

1 min read

జిల్లా క్రీడా భివృద్ధి అధికారి జి. చంద్ర శేఖర్

మదనపల్లె  బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి : జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అన్నమయ్య జిల్లాఆధ్వర్యంలో ఈ నెల 10న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 రాష్ట్ర జట్ల ఎంపికలు జరగనున్నాయిని జిల్లా క్రీడా భివృద్ధి అధికారి జి. చంద్ర శేఖర్ తెలిపారు. సోమవారం అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో వచ్చే నెల 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వ హించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్ల ఎంపిక లను ఈ నెల 10వ తేదీన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్  ఆధ్వర్యంలో నిర్వ హించనున్నట్లు అన్నమయ్య జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి. చంద్రశేఖర్  తెలిపారు. ఈ ఎంపికల్లో అండర్ –18 విభాగంలో బాలురకు కబడ్డీ, ఖోఖోతో పాటు బాలబాలికలకు మల్లఖంబ్ క్రీడాంశాల్లో రాష్ట్ర జట్లను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ఎంపిక పోటీల వేదికలు:

కబడ్డీ : (బాలురకు) బీఆర్ స్టేడియం, గుంటూరు.

ఖోఖో: (బాలురకు) డీఎస్ఏ స్టేడియం, కాకినాడ.

మల్లఖంబ్: (బాల బాలికలకు) ఎస్‌హెచ్‌బీఆర్‌ఎం హైస్కూల్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా.

జనవరి 1, 2009వ తేదీ తర్వాత జన్మించిన క్రీడా కారులు ఈ ఎంపిక పోటీలకు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అన్నమయ్య జిల్లా క్రీడాకారులు పదవ తరగతి మార్కుల సర్టి ఫికెట్, పాస్‌ పోర్టు సైజు ఫోటో, ఆధార్ కార్డు లేదా జనన ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకొని ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటలకు సంబంధిత క్రీడా ప్రాంగణాల్లో హాజరై ఎంపిక పోటీల్లో పాల్గొనాలని సూచించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026లో పాల్గొనే రాష్ట్ర జట్ల ఎంపికలకు అర్హత కలిగిన అన్న మయ్య జిల్లా క్రీడాకారులు అధిక సంఖ్యలో హాజరై ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకో వాలని తెలిపారు. ఎంపిక పోటీలకు అవసరమైన ధ్రువ పత్రాలతో సంబంధిత క్రీడా ప్రాంగణాలకు ఉదయం 9 గంటలకు చేరు కోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం 99082 67811 నంబరులో సంప్రదించా లని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *