మదనపల్లె మండల ఎంపీటీసీలకు ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఘన సన్మానం
1 min read
ప్రజల నమ్మ కాన్ని నిలబెట్టు కోవాలి
గ్రామాల అభివృద్ధి కి కృషి చేయాలి
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి: ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మదనపల్లె మండల పరిధిలో కూటమి పార్టీల తరఫున విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యుల ను ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఘనంగా సోమ వారం సన్మా నించారు. ఈ సందర్భంగా విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యుల తో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వ హించి అభినంద నలు తెలిపారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ భాషా మాట్లా డుతూ ఎన్నికల్లో ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. పదవులు బాధ్యత తో కూడుకున్నవని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ప్రతి గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపా యాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.అనంతరం ఎన్నికల్లో విజయం సాధించిన మండల ఎంపీటీసీ సభ్యు లను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మా నించి శుభాకాంక్షలు తెలిపారు.ప్రజా సేవే లక్ష్యంగా గ్రామాల అభివృద్ధే ధ్యేయం గా ముందుకు సాగాలని ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఎంపీటీసీ సభ్యుల కు పిలుపు నిచ్చారు.


