NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేటినుండి ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారి క్యాంపు కోర్టులు ప్రారంభం

1 min read

కర్నూలు,న్యూస్​ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న క్యాంపు కోర్టు నిర్వహణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గౌరవ చైర్మన్ శ్రీ జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుండి 13వ తేదీ వరకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నందు హెచ్ఆర్సీ క్యాంపు కోర్టు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు క్యాంప్ కోర్టు నోడల్ అధికారి బొగ్గరం తారక నరసింహ కుమార్ తెలిపారు ఈ క్యాంపు కోర్టు నందు ఎన్టీఆర్ జిల్లా కృష్ణాజిల్లా ఏలూరు జిల్లా, (భీమవరం) పశ్చిమగోదావరి జిల్లా లకు సంబంధించిన కేసుల విచారణలతో పాటు నూతన కేసుల స్వీకరణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని కోరారు ఈ క్యాంపు కోర్టు కార్యక్రమాల్లో హెచ్ఆర్సీ పరిధిలోని పెండింగ్ లో ఉన్న కేసులలోని ఆయా జిల్లాల అధికారులు విజయవాడ కేంద్రంగా నిర్వహించబడే ఈ క్యాంపు కోర్టుకి హాజరుకావాలని సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *