NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్ల నివారణకు పటిష్ట చర్యలు

1 min read

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి

కర్నూలు, న్యూస్​నేడు: రాష్ట్రంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో అగ్ని ప్రమాదాలు, పేలుళ్లను నివారించి కార్మికుల ప్రాణాలకు, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms.No.234, తేదీ 07-11-2026 ద్వారా సమగ్ర భద్రతా మార్గదర్శకాలను జారీ చేసిందని, ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి పేర్కొన్నారు. బాణసంచా తయారీ కేంద్రాల యజమానులు ప్రభుత్వ భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని, ప్రజల ప్రాణ రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని బాణసంచా తయారీ, నిల్వ మరియు విక్రయ కేంద్రాలపై రెవెన్యూ, అగ్నిమాపక, పోలీస్, కార్మిక, ఫ్యాక్టరీస్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు సమన్వయంతో తనిఖీలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నార.ఫైర్‌వర్క్స్ సేఫ్టీ కమిటీ ద్వారా తనిఖీల్లో నిర్లక్ష్యం వహించడం, ఉల్లంఘనలను గుర్తించకపోవడం లేదా వాటిపై చర్యలు తీసుకోకపోవడం వంటి సందర్భాల్లో బాధ్యులైన అధికారులపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *