మదనపల్లె నియోజకవర్గం జడ్పీటీసీ, ఎంపిటీసి స్థానా లలో ట్యాంప రింగ్
1 min read
ఫలితాలు తారు మారు చేసి ప్రకటన
రామసముద్రం జడ్పీటీసీ ప్రకటనపై కోర్టు ను ఆశ్రయిస్తాం
మదనపల్లె వైయస్సార్సిపి సమన్వయకర్త ఎస్.నిసార్ అహమ్మద్
మదనపల్లె బి. శ్రీనివాసులు రెడ్డి న్యూస్ నేడు ప్రతినిధి :మదనపల్లె నియోజక వర్గంలో ప్రకటించిన ఎన్నికల ఫలితాలలో వైయస్సార్ సిపి ఆధిక్యత కనబరి చిందని, ఫలితాల ప్రకటనలో కూటమి ప్రభుత్వ పెద్దలు సంబంధిత అధి కారులపై ఓత్తిడి తెచ్చి వాస్తవ విరుద్ధంగా ప్రకటన లు చేశారని మదనపల్లె వైయస్సార్ సిపి సమన్వయకర్త ఎస్. నిసార్ అహమ్మద్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ మదనపల్లె నియోజకవర్గం ఎన్నికల యుద్దంలో కూటమి తో పోరాటం చేసి గెలిచిన వైయస్సార్ సిపి కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపిటీసి లకు శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లె నియో జకవర్గంలో మూడు జడ్పీటీసీలు గెలుపు సాధించాం. కానీ రామసముద్రంలో మంత్రి ప్రోద్భలంతో గెలిచిన వ్వక్తిని పక్కన పెట్టి, ఓడిన వ్వక్తిని ప్రకటించా రని ఆరోపణలు చేశారు. సంబంధిత ఎన్నికల అధికారుల పై ఖచ్చితంగా కోర్టు వెళ్తామని ప్రక టించారు. మదన పల్లె నియోజక వర్గంలో 50 ఎంపిటీసి లకు 21 గెలుపొందారు. ఎక్కువ ఎంపిటీసి లు గెలుపొందిన కొన్నిచోట్ల బల వంతపు ప్రకటనలు చేయించారని ఆరోపించారు. వాస్తావానికి మదనపల్లె, రామ సముద్రం, నిమ్మన పల్లె మండలలో వైసీపీ అత్యధిక ఎంపిటీసిలు, జడ్పీటీసీలు గెలుపు సాధిస్తే రామ సముద్రంలో కావా లనే అధికార పార్టీ ఓత్తిడితో టిడిపి అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారన్నారు. నామినేషన్లు వేసే నాటి నుంచి గెలుపు దృవీకరణ పత్రం అందుకునే వరకు కూటమి ప్రభుత్వం ఓత్తిడి అధికంగా ఉన్న తట్టుకుని నిలబడిన ప్రతి వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్పూర్తితో రాబోవు అన్ని ఎన్నికలలో కలసికట్టుగా పోరాటం చేసి గెలుపు సాధిస్తామి ధీమా వ్వక్తం చేశారు.


