NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పీ చైర్మన్ గుండం రమణారెడ్డి’కే.?

1 min read

నేడు జడ్పీ చైర్మన్ పీఠముడి వీడనుందా.?

నేడు మంత్రులు ఎమ్మెల్యేల సమావేశం-ఏళ్ల రాజకీయ చరిత్ర-రాజకీయ అనుభవజ్ఞుడు

గుండం రమణారెడ్డి..

నందికొట్కూరు న్యూస్ నేడు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న జిల్లా పరిషత్ చైర్మన్ కార్యాలయాన్ని నంద్యాల జిల్లా అయిన తర్వాత ప్రత్యేకంగా నంద్యాలలో జడ్పీ కార్యాలయాన్ని అధికారులు ప్రారంభించిన సంగతి తెలిసిందే.జిల్లాకు 28 మండలాల్లో జడ్పిటిసి సభ్యులు ఉన్నారు.జిల్లా పాలకవర్గ సమావేశాలు ఇకనుండి నంద్యాల కేంద్రంలోనే జరగనున్నాయి.

జడ్పీ చైర్మన్ పీఠం గుండం రమణారెడ్డికి వరించనుందా.?

ఈయన స్వస్థలం: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామ నివాసి గుండం రమణారెడ్డి.. ఈయన తల్లిదండ్రులు గుండం రంగారెడ్డి, ఈశ్వరమ్మ.రమణారెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నారు.వీరు ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు సిస్టర్లు..రమణారెడ్డి తండ్రి రంగారెడ్డి ఏకధాటిగా 1970 నుండి 1980 వరకు సర్పంచ్ గా ఉన్నారు. ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిచయాల వల్ల ఈయన వెలుగోడు తెదేపా జడ్పిటిసి అభ్యర్థిగా నామినేషన్ వేసి ఏకగ్రీవంగా జడ్పిటిసిగా ఎన్నికయ్యారు. జడ్పీ చైర్మన్ అన్ రిజర్వ్ కావడంతో ఈ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది.

చైర్మన్ పీఠంపై నేడు మంత్రులు ఎమ్మెల్యేల సమావేశం

నంద్యాల జిల్లాలో 28 జడ్పిటిసి సభ్యులు ఉండగా

23 మంది టీడీపీ జడ్పిటిసీ సభ్యులు ఉన్నారు.జడ్పీ చైర్మన్ కుర్చీ కోసం రమణారెడ్డితో పాటు ఇతర నియోజకవర్గానికి చెందిన ఇద్దరు,ముగ్గురు పోటీలో ఉన్నట్లు కుర్చీలో కూర్చునేందుకు వారు ఆ ఎమ్మెల్యే ద్వారా బలంగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ రోజు మంత్రులు జిల్లాలో ఉన్న ఏడు మంది ఎమ్మెల్యేలు జడ్పీ పీఠంపై సమావేశంపై చర్చించనున్నారు.ఈరోజు మంగళవారం జరిగే సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎవరనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

5 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకున్న గుండం

జడ్పీ చైర్మన్ సీట్ మద్దతు కోసం జిల్లాలో ఉన్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,ఎన్ఎండీ ఫరూక్ మరియు ఐదుగురు ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి,గిత్త జయసూర్య,బుడ్డా రాజశేఖర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు రమణారెడ్డికి ఉన్నట్లు తెలుస్తోంది.

వరుసగా రెండుసార్లు ఏఎంసీ చైర్మన్

గతంలో తెలుగుదేశం పార్టీ అధికార హయాంలో అప్పటి టిడిపి సీనియర్ నాయకులు గౌరు వెంకటరెడ్డి,మాండ్ర శివానందరెడ్డి సహకారంతో వరుసగా రెండుసార్లు నందికొట్కూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా గుండం రమణారెడ్డి నియోజకవర్గ రైతుల అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడ్డారు. తెలుగుదేశం పార్టీకి గత 30 సంవత్సరాల నుండి పార్టీ విధేయుడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *