NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అన్నమయ్య జిల్లాలో కూటమి జడ్పిటిసిలదే విజయం

1 min read

టిడిపి కి 15, బిజెపి 1 వైసీపీ 6 స్థానాలు

మదనపల్లె  న్యూస్ నేడు ప్రతినిధి  :ఈనెల 7వ తేదీన జరిగిన జడ్పిటిసి ఎన్నికల ఫలితాల లెక్కింపులో అన్నమయ్య జిల్లాలో కూటమి జెడ్పిటిసి అభ్యర్థులు విజయం సాధించి అగ్రభాగాన నిలిచారు. జిల్లాలో 22 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 15, బిజెపి ఒకటి, వైయస్సార్సీపి ఆరు స్థానాలను దక్కించు కున్నాయి. ఇందులో మండలాల వారీగా పరిశీలిస్తే బి. కొత్త కోట మండలం లో వై లక్ష్మీదేవమ్మ వైఎస్ఆర్సిపి, చిన్నమండెం మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం, చౌడేపల్లి జి కవిత టిడిపి, గాలివీడు సుగవాసి ప్రసాద్ బాబు టిడిపి, గుర్రంకొండ షేక్ అజాజ్ అహ్మద్ టిడిపి, కలకడ ఎర్రయ్య  వెంకటరమణ టిడిపి, కలికిరి కే షర్మిల టిడిపి, కంభం వారి పల్లె పి రెడ్డి మహేంద్రా టిడిపి, కురబలకోట పి సురేంద్ర యాదవ్ టిడిపి, మదనపల్లె జె కిరణ్మయి వైయస్సార్సీపి, మొలకలచెరువు జె మీనా బిజెపి, నిమ్మనపల్లి బి మనోహర్  వైఎస్ఆర్సిపి, పెద్దమండ్యం ఆవుల మల్లికార్జున రెడ్డి వైఎస్ఆర్సిపి, పెద్ద తిప్ప సముద్రం టి శరణ్య టిడిపి, పీలేరు పురం రెడ్డమ్మ టిడిపి, పుంగనూరు తుమరం నర సింహులు టిడిపి , రామసముద్రం ఏ సుజాత టిడిపి, సంబేపల్లి మల్లికార్జున టిడిపి, సదుం ఓర్స్ పుట్రాజ్  వైఎస్ఆర్సిపి, సోమల సుబ్రహ్మణ్యం నాయుడు టిడిపి, తంబళ్లపల్లి బుక్కే సందప్ప వైఎస్ఆర్సిపి, వాల్మీకిపురం కే లక్ష్మీదేవి టిడిపి పార్టీల నుంచి గెలుపొందారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *