NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కార్తీక మాసం ప్రారంభం – ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా ‘ఆకాశ దీపం’ ఏర్పాటు”

1 min read

ఇంద్రకీలాద్రి, న్యూస్​ నేడు: శ్రీ పరాభవ నామ సంవత్సర కార్తీక మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శాస్త్రోక్తంగా “ఆకాశ దీపం” ఏర్పాటు కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. శ్రీకనక దుర్గమ్మ, శ్రీ మల్లేశ్వర స్వామి వార్ల సన్నిధి మరియు శ్రీ నటరాజ స్వామి వారి ఆలయంలో  స్థానాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ విశేష క్రతువు జరిగింది.  ఈ పూజా కార్యక్రమాలలో దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి  వి.కె. శీనా నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు సమర్పించారు.  కార్తీక మాసంలో ప్రదోష వేళ ఆకాశ దీపాన్ని దర్శించుకోవడం వల్ల సర్వపాపాలు నశించి, అకాల మృత్యు భయాలు తొలగిపోతాయని మరియు సమస్త శుభాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్ర వచనం. సకల లోకాలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని కాంక్షిస్తూ ఈ దివ్య దీపాన్ని శాస్త్రోక్తంగా వెలిగించి ఆలయ ధ్వజంనకు ఏర్పాటు చేసినట్లు అర్చకస్వాములు తెలిపారు.కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై నిత్యం జరిగే విశేష అభిషేకాలు, బిల్వార్చనలు, లక్ష్మీ గణపతి పంచాక్షరీ పారాయణములు తదితర వైదిక సేవల కొరకు భక్తులకు అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన అర్చకులు, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *