వారానికి ఒకరోజు ఇన్సులిన్ తో ఎన్నో ప్రయోజనాలు”
1 min read
డా. నీలవేణి, ఎండోక్రనాలజీ విభాగాధిపతి ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్….
కర్నూలు,న్యూస్ నేడు: మధుమేహ వ్యాధిగ్రస్తుల ఇన్సులిన్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని గతంతో పోలిస్తే చికిత్సలో ఎంతో మెరుగైన మందులు ఇంజక్షన్లు అందుబాటులోకి వచ్చాయని అందులో భాగమే ప్రతిరోజు ఇన్సులిన్ తీసుకోవడానికి బదులు వారానికి ఒక్కరోజు ఇన్సూరెన్స్ తీసుకుంటే సరిపోతుందని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఎండోక్రనాలజీ విభాగాధిపతి డాక్టర్ నీలవేణి అన్నారు గురువారం కర్నూలు మెడికల్ కాలేజీ యందు ఎండోక్రనాలజీ విభాగం ఆధ్వర్యంలో మోర్టాన్ స్కిల్ ల్యాబ్ యందు ప్రపంచ మధుమేహ దినోత్సవం–2026 పురస్కరించుకొని “Early Action on Diabetes – Transforming Insulin Therapy: Once Weekly Insulin” అనే అంశంపై సీఎంఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇన్సులిన్ చికిత్సలో కొత్తగా వచ్చిన ఇంజెక్షన్ ల వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉండడంతో పాటు బరువు కూడా తగ్గేందుకు అవకాశం ఉందని తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ కె. చిట్టి నరసమ్మ, సూపరిండెంటు డా. వెంకటేశ్వర్లులుమాట్లాడుతూ మధుమేహ వ్యాధి నియంత్రణలో ముందస్తు గుర్తింపు, సకాలంలో చికిత్స ప్రారంభించడం ఎంతో కీలకమని, ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు.ఈ CME కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీరాములు ఎండోక్రనాలజీ జనరల్ మెడిసిన్ పీజీ వైద్యులు వివిధ విభాగాల వైద్యులు ఈ సీఎంఈలో పాల్గొన్నారు.



