NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేదల పండుగకు ప్రభుత్వ ధరల కానుక!

1 min read

రూ.100కే కిలో కందిపప్పు.. రూ.125కే లీటర్ పామాయిల్‌!

రేషన్‌ కార్డుదారులకు భారీ ఊరట.. చౌక ధరల దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: క్రిస్మస్‌, సంక్రాంతి పండుగల వేళ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ సామాన్యులపై ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో, రేషన్‌ కార్డుదారులకు తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా రాయితీ ధరలకు సరుకులు పంపిణీ చేయనున్నారు.

ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఇవే!

– కందిపప్పు – కిలో రూ.100

– పామాయిల్‌ – లీటరు రూ.125

– గోధుమ పిండి – కిలో రూ.25

మూడు నెలల పాటు ప్రత్యేక పంపిణీ!

డిసెంబరు నుంచి వరుసగా మూడు నెలల పాటు ఈ రాయితీ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. పండుగల సమయంలో కుటుంబాలకు అవసరమైన సరుకులు తక్కువ ధరలకు అందుబాటులోకి రావడంతో పేదలకు కొంత ఆర్థిక వెసులుబాటు కలగనుంది.ఈ పథకం అమలుతో మూడు నెలల కాలానికి ప్రభుత్వంపై సుమారు రూ.300.60 కోట్ల ఆర్థిక భారం పడనుంది. ఈ మేరకు రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ కమిషనర్‌, ప్రభుత్వ ఎక్స్‌-అఫీషియో కార్యదర్శి కె.కన్నబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.పండుగల వేళ సామాన్యులకు ధరల భారం తగ్గించి, నిత్యావసర సరుకులను అందుబాటు ధరల్లో అందించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *