కిమ్స్ కడల్స్‌లో ఘనంగా ప్రపంచ ప్రీ మెచ్యూరిటీ దినోత్సవ వేడుకలు
1 min read
గత ఏడేళ్లలో కిమ్స్ ఆసుపత్రిలో జన్మించి, చికిత్స పొందిన ప్రీ మెచ్యూర్ చిన్నారులు, వారి కుటుంబాలతో ప్రత్యేక కార్యక్రమం
పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షో తదితర వినోద కార్యక్రమాలు
నెలలు నిండకుండానే పుట్టినా.. సరైన వైద్య సంరక్షణతో ఆరోగ్యంగా ఎదగవచ్చనే సందేశం
కర్నూలు, న్యూస్ నేడు : నెలలు నిండకముందే పుట్టిన శిశువులకు సకాలంలో వైద్య చికిత్స, అత్యాధునిక నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్, సరైన పోషకాహారం, తల్లిదండ్రుల భాగస్వామ్యం, నిరంతర వైద్య పర్యవేక్షణ అందిస్తే సాధారణ జీవితాన్ని అస్వాధించవచ్చన్నారు కిమ్స్ కడల్స్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషన్ డా. గోవర్ధన్ రెడ్డి. అంతర్జాతీయ ప్రీ మెచ్చూరిటీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కిమ్స్ కడల్స్ కర్నూలు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గత ఏడేళ్లలో కిమ్స్ ఆసుపత్రిలో నెలలు నిండకుండానే జన్మించి, వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స పొందిన చిన్నారులు, వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, డా. నవీద్, డా. ఫణిభూషణ్, డా. భారతి, హాస్పిటల్స్ సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీనంగా జన్మించి, ఎన్నో ఆరోగ్య సవాళ్లను అధిగమించిన చిన్నారులు నేడు ఆరోగ్యంగా, చురుగ్గా ఎదగడం ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. సరైన వైద్య సంరక్షణ, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ప్రీ మెచ్యూర్ పిల్లలు కూడా ఇతర చిన్నారుల మాదిరిగానే ఆరోగ్యంగా ఎదిగి, చదువులోనూ, ఇతర రంగాల్లోనూ రాణించగలరనే భరోసాను తల్లిదండ్రులకు వస్తుందన్నారు.నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలు, వారికి అవసరమైన ప్రత్యేక వైద్య సంరక్షణపై అవగాహన కల్పించారు. చిన్నారుల కోసం పాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షోతో పాటు పలు వినోదభరిత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రీ మెచ్యూర్ పిల్లల తల్లిదండ్రులు ఒకరినొకరు కలుసుకుని, తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు తమ పిల్లల ఎదుగుదల, విజయాలను ఆనందంగా పంచుకున్నారు. ప్రస్తుతం నెలలు నిండకుండానే జన్మించిన శిశువుల సంరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తల్లిదండ్రులకు ఈ చిన్నారుల ఎదుగుదల స్ఫూర్తినిస్తుందని నిర్వాహకులు తెలిపారు. నెలలు నిండకముందే పుట్టడం అనేది వారి జీవిత ప్రయాణంలో ఒక ఆరంభం మాత్రమేనని, అది వారి భవిష్యత్తుకు పరిమితి కాదనే ఆశావహ సందేశాన్ని ఈ వేడుకలు అందించాయి.


