NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థుల ఎంపిక

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు : లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలకు చెందిన కె. అనిల్ (10వ తరగతి), కె. రక్షిత (9వ తరగతి) అండర్-17 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు నవంబర్ 21 నుంచి 23 వరకు కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో జరగనున్నాయి.ఈ సందర్భంగా సీఈఓ జి. గోపీనాథ్ , కో-సీఈఓ   జి. సౌమ్య గోపీనాథ్  విద్యార్థులను అభినందించి, జట్టుకు వెన్నెముకగా నిలిచి విజయాలు సాధిస్తూ జాతీయస్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు శిక్షణ అందించిన కోచ్ ఎస్. సాబీర్ అలీని యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఎ. రాజ్ కమల్ , హెచ్‌ఓడీలు ఎ. నాగేంద్ర, ఎస్. శ్రీనివాసులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *