ప్యాపిలిలో మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికకు ఏర్పాట్లు -ఎంపిడిఓ శ్రీనివాసరావు
1 min read
నేడు మండల పరిషత్ కార్యాలయంలో కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక.. నూతన ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో మండల పరిషత్ నూతన పాలకవర్గం ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అక్టోబర్ 19వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు ప్యాపిలి మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సమావేశంలో తొలుత కోఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహించనున్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తదుపరి మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ చేపట్టనున్నారని ఆయన తెలిపారు.


