స్విమ్మింగ్లో వైశాలి ప్రతిభ.. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక!
1 min read
జిల్లా స్థాయి పోటీల్లో రెండు విభాగాల్లో ప్రథమ స్థానం.. అభినందించిన ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని వైశాలి స్విమ్మింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం ఆమెను అభినందించారు.కర్నూలు పట్టణంలోని కిసాన్ ఘాట్ సమీపంలో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఈ నెల 17వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లా అండర్-19 విభాగంలో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వైశాలి అద్భుత ప్రతిభ కనబరిచింది. 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 50 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగాల్లో ప్రథమ స్థానం సాధించగా, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ విభాగంలో ద్వితీయ స్థానం కైవసం చేసుకుంది.ఈ విజయంతో ఈ నెల 21వ తేదీన తిరుపతిలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ పోటీలకు వైశాలి ఎంపికైంది.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు తమకు ఇష్టమైన క్రీడల్లోనూ ఆసక్తి కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వైశాలి సాధించిన విజయం కళాశాలకు గర్వకారణమని పేర్కొంటూ రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అనంతమ్మ, నవీన పాటి, మద్దిలేటి, వెంకటరమణ, ఓబులేసు, శంకరయ్య, వెంకటేశ్వర్లు, ముస్తాక్, మురళీమోహన్ గౌడ్, సురేష్, మంజునాథ్, వన్నూర్ తదితరులు పాల్గొని వైశాలిని అభినందించారు.


