NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అవస్థలు.. అధికారులకు పట్టింపేది?

1 min read

20 రోజులుగా విద్యార్థి బస్సు లేక ట్రాక్టర్లు, లారీల్లో ప్రమాదకర ప్రయాణం

ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్‌కు పలుమార్లు విన్నవించినా స్పందన కరువు

జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి – చిన్నహ్యాట ప్రకాష్

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల పరిధిలోని చిన్నహ్యాట, బీజీ హళ్లి, ఎల్లార్తి, నేరణికి తదితర గ్రామాలకు చెందిన విద్యార్థులు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 20 రోజులుగా విద్యార్థుల కోసం నడిచే బస్సు లేకపోవడంతో చేసేదేమీ లేక ట్రాక్టర్లు, లారీల్లో ప్రయాణిస్తూ పాఠశాలలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.ప్రతిరోజూ విద్య కోసం ప్రయాణించే చిన్నారులు, విద్యార్థులు సరైన రవాణా సౌకర్యం లేక ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల సమస్యను పలుమార్లు ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని చిన్నహ్యాట ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థుల భవిష్యత్తును, వారి ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆర్టీసీ అధికారులతో సమన్వయం చేసుకొని ఆయా గ్రామాల విద్యార్థులకు వెంటనే బస్సు సౌకర్యం పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ఇకనైనా అధికారులు నిర్లక్ష్యం వీడి విద్యార్థుల ఇబ్బందులను పరిష్కరించాలని, ట్రాక్టర్లు, లారీల్లో ప్రమాదకర ప్రయాణానికి స్వస్తి పలికేలా తక్షణమే ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని చిన్నహ్యాట ప్రకాష్ కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *