NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు

1 min read

వెలుగోడు న్యూస్ నేడు : 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఈరోజు వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు శాఖా గ్రంథాలయ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించమైనది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో వాక్చాతుర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు పఠనాసక్తిని ప్రోత్సహించేందుకు ఇటువంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు.విద్యార్థులు ఉత్సాహంగా వక్తృత్వ పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *