కొలిక్కి వస్తున్న సర్పంచ్ అభ్యర్థులు
1 min read
అవకాశమివ్వండి అభివృద్ధి చేస్తాం
మిడుతూరు న్యూస్ నేడు: డిసెంబర్ రెండవ తేదీన జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో ఆశావహుల సందడి నెలకొంది.ఈనెల 21 నుండి పంచాయతీ నామినేషన్ల పర్వం దగ్గరికి రావడంతో గ్రామాల్లో నాయకులు అభ్యర్థుల ఎంపికపై పూర్తిగా నిమగ్నమయ్యారు.
సర్పంచ్ బరిలో ఉన్న తెదేపా అభ్యర్థులు
మండలంలోని పీరు సాహెబ్ పేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మర్రికుంట సురేఖ బరిలో ఉన్నారు. దేవనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పాణ్యం జ్యోతి.. కడుమూరు సర్పంచ్ అభ్యర్థిగా హెచ్ ఫరీదాభీ.. చింతలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లంపల్లి రంగారెడ్డి..పైపాలెం రమాదేవి సర్పంచ్ గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ ఎన్నికల్లో మమ్మల్ని ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని వారు అన్నారు.


