” గుడిపాడు గ్రామం లో న్యాయ సహాయ కేంద్రం ప్రారంభం”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: గూడూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో న్యాయ సహాయ కేంద్రాన్ని శ్రీ పి. వాసు ఆరవ అదనపు జిల్లా జడ్జి మరియు ఫుల్ అడిషనల్ చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్, జిల్లా న్యాయ సేవాదికార సంస్థ గారు బుధవారం 18-11-2026 న ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాది కార సంస్థ వారి ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన అన్ని పథకాల అమలులో భాగంగా 60 రోజుల మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడం న్యాయపరమైన సమస్యలపై అవగాహన కల్పించడం అర్హులైన వారికి న్యాయ సేవ అధికార సంస్థ ద్వారా అందించే సేవలు మరియు పథకాల ప్రయోజనాలను చేరవేయడం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు.ఈ న్యాయ సహాయ కేంద్రం ద్వారా ప్రజలు తమ న్యాయపరమైన సమస్యలకు సంబంధించిన అవసరమైన సలహాలు సూచనలు మరియు ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చును అని అన్నారు. ఈ సమావేశంలో గూడూరు తాసిల్దార్ వెంకటేష్ నాయక్, గూడూరు డిప్యూటీ ఎంపీడీవో లావణ్య ప్రియ, కోడుమూరు ఇన్స్పెక్టర్ తబ్రేజ్, గూడూరు ఎస్సై రాజకులయప్ప, గుడిపాడు పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ చంద్ర కళ,, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, ప్యానల్ న్యాయ వాది వెంకటేశ్వర్లు,లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్,ప్యారా లీగల్ వాలంటీర్స్, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.


