NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పల్లె పోటీకి సిద్ధమౌతున్న అభ్యర్థులు

1 min read

మహిళల్లో కనిపిస్తున్న ఉత్సాహం..

మిడుతూరు న్యూస్ నేడు: పల్లె పంచాయతీ గ్రామ సర్పంచ్ గా పోటీ చేసేందుకు పల్లెల్లో ఉత్సాహం రెట్టింపు అవుతోంది.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలో 19 పంచాయితీలు ఉండగా ఆయా గ్రామాల పంచాయతీ రిజర్వేషన్లకు అనుగుణంగా మేము కూడా గ్రామ పరిపాలనలో బాగమౌతామంటూ మహిళలు సర్పంచ్ గా పోటీ చేసేందుకు ముందుకొస్తున్నారు.కొన్ని గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు కొలిక్కి వచ్చినా ఇంకా మిగతా గ్రామాల్లో నాయకులు సరైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు.

బరిలో నిలుచున్న వైసీపీ సర్పంచ్ అభ్యర్థులు

పైపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పిక్కిలి స్వాతి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

కడుమూరు సర్పంచ్ అభ్యర్థిగా రాబియాభీ, దేవనూరు సర్పంచ్ అభ్యర్థి ఓర్సు హరిత,పీరు సాహెబ్ పేట సర్పంచ్ అభ్యర్థి పాపిరెడ్డి వైష్ణవి సర్పంచ్ బరిలో ఉన్నారు.సుంకేసుల సర్పంచ్ అభ్యర్థిగా అందే మార్తమ్మ..చింతలపల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఎంపీటీసీ వై నాగేశ్వర రెడ్డి

పోటీలో ఉన్నారు.డిసెంబర్ నెల రెండవ తేదీన జరిగే పంచాయతీ ఎన్నికల్లో మమ్మల్ని బలపరచాలని గ్రామాభివృద్ధికి సేవ చేసేందుకు మాకు అవకాశం  ఇస్తే గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని సర్పంచ్ అభ్యర్థులు అంటున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *