యువత.. సమాజ సేవపై దృష్టి పెట్టాలి
1 min readనెహ్రు యువ కేంద్రం జిల్లా యువజన అధికారి మణికంఠ
పల్లెవెలుగు వెబ్, మైదుకూరు: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ… చదువు, సమాజ సేవపై దృష్టిసారించాలని నెహ్రు యువ కేంద్రం జిల్లా యువజన అధికారి మణికంఠ అన్నారు. బుధవారం నెహ్రూ యువ కేంద్రం మరియు మీకోసం సేవా సంస్థ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఖాజీపేట సాహిత్య డిగ్రీ కాలేజ్ లో యూత్ క్లబ్ డెవలప్మెంట్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన నెహ్రు యువ కేంద్రం జిల్లా యువజన అధికారి మణికంఠ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అత్యంత యువశక్తి కలిగిన దేశం మన భారత దేశమేనని, యువత ఇతర వ్యమోహాల మీద దృష్టి పెట్టకుండా , చదువు మీద, సమాజ సేవ మీద దృష్టి పెట్టాలన్నారు. నెహ్రూయువ కేంద్రం ఒక దిక్సూచి లాగా ఉంటుందని ఆయన అన్నారు. మహిళల మీద జరుగుతున్న అన్యాయలను అరికట్టే విధంగా యువత అంత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సంజీవ రెడ్డి, అధ్యాపకులు డాక్టర్ తవ్వా వెంకటయ్య, మీకోసం సేవా సంస్థ విష్ణు వర్ధన్, అమ్మ సేవా సమితి శివశంకర్, మాల కొండయ్య, అజయ్,ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.