NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైబర్ మోసానికి గురైన బాధితుడి కి రూ.4 లక్షలు తిరిగి అందజేత

1 min read

గుజరాత్‌లో నిందితులను గుర్తించారు .

నిందితుల నుండి నగదు రికవరీ చేసిన కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు.

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు పట్టణానికి చెందిన దండు నాగరాజు  తెలియని YONO యాప్ లింక్‌ను క్లిక్ చేయడంతో ఆయన మొబైల్ ఫోన్ హ్యాక్ కావడంతో పాటు బ్యాంకు ఖాతా కూడా హ్యాక్ అయింది. దీంతో ఆయన ఖాతా నుంచి సుమారు రూ.4 లక్షలు వివిధ క్రెడిట్ కార్డులకు బదిలీ అయ్యాయి.ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కర్నూలు నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.కర్నూలు ఎస్పీ  విక్రాంత్ పాటిల్ ఐపీఎస్  ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి సహకారంతో డెబిట్ అయిన బ్యాంకు ఖాతాలను సాంకేతికంగా విశ్లేషించి నిందితుల ఆచూకీని గుర్తించారు.కర్నూలు నాలుగవ పట్టణ సీఐ విక్రమ్ సింహా ఆధ్వర్యంలో ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి , హెడ్ కానిస్టేబుల్ జీసస్‌లతో కూడిన ప్రత్యేక బృందం గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌కు వెళ్లారు.

నిందితులు 1) యాసిన్ యూసుఫ్ భాయ్ పిపాడ్వాలా మరియు,,2)  ఆవేశ్ యాసిన్ పిపాడ్వాలాలను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారిని స్థానిక పోలీసులకు అప్పగించి చట్టపరమైన చర్యలు చేపట్టారు.నిందితుల నుంచి సైబర్ మోసం ద్వారా అపహరించిన రూ.4 లక్షలను రికవరీ చేసి అవసరమైన చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం బాధితుడు కర్నూలు పట్టణానికి చెందిన దండు నాగరాజుకి అందజేశారు.ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ… ప్రజలు తెలియని లింకులు క్లిక్ చేయవద్దని బ్యాంకు వివరాలు ఓటీపీలు పిన్ నంబర్లు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్‌లైన్ కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *