NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జి.ఓ. నెం.396 ఉపసంహరించాలి…

1 min read

ప్యాపిలిలో 20 నుంచి నిరవధిక పెన్‌డౌన్‌కు దస్తావేజు లేఖర్లు

ప్యాపిలి న్యూస్ నేడు జూలై 17: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం.396ను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని దస్తావేజు లేఖర్లు, లేఖరి సహాయకులు, డి.టి.పి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు డిమాండ్ చేశారు.ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ సేవలతో పాటు దస్తావేజుల తయారీ విధానాన్ని కూడా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు అప్పగిస్తూ జారీ చేసిన జి.ఓ.396 వల్ల వేలాది మంది దస్తావేజు లేఖర్లు, వారి సహాయకులు, డి.టి.పి ఆపరేటర్లు, స్టాంపు వెండర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జూలై 20 నుంచి 31 వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్యాపిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిరవధిక పెన్‌డౌన్ చేపట్టనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా ప్రజలు, కక్షిదారులు తమ సమస్యను అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే జి.ఓ.396ను వెంటనే ఉపసంహరించి, తమ జీవనోపాధిని కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు సబ్ రిజిస్ట్రార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *