బిపిన్ రావత్ స్థానంలో నరవణే !
1 min read

పల్లెవెలుగువెబ్ : ఇటీవల ఆర్మీ హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించి సీడీఎస్ బిపిన్ రావత్ స్థానంలో నరవణేను కేంద్రప్రభుత్వం నియమించింది. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్‌గా ఉన్న జనరల్ నరవణెని సీడీఎస్ పదవి వరించింది. త్రివిధ దళాల్లో టాప్ ఆఫీసర్‌ను సీడీఎస్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జనరల్ బిపిన్ రావత్ తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె సీనియర్ అధికారి. త్రివిధ దళాల్లో ఉన్నతాధికారుల వివరాలు చూస్తే జనరల్ నరవణె కంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నావీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సుమారు రెండేళ్లు జూనియర్లు. దీంతో నరవణెను సీడీఎస్‌గా కేంద్రం నియమించింది.

