గోవులను పెంచితే రూ. 1000 !
1 min read

పల్లెవెలుగువెబ్ : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. సంరక్షణ కరవైన గోవులను పెంచే రైతులకు వెయ్యి రూపాయల సాయమందిస్తామన్నారు. రాష్ట్రంలో గో హత్యలు జరగనీయబోమని అమేథీలో జరిగిన ఎన్నికల సభలో స్పష్టం చేశారు. అక్రమ గోవధ శాలలు తెరవనిచ్చే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. సంరక్షణ లేని గోవులు రైతుల పంటపొలాలు దెబ్బతీయకుండా చూస్తామన్నారు.

