PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్ఆర్ఆర్ రెండో రోజు కలెక్ష‌న్లు ఎంతో తెలుసా .. మైండ్ బ్లోయింగ్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డు కలెక్ష‌న్లు వ‌సూలు చేస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగారూ.223 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నిన్న శనివారం కావడంతో ఈ కలెక్షన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. హిందీలో తొలిరోజు రూ.18 కోట్లు రాబట్టి సాహో రికార్డును దాటలేకపోయిన ఈ సినిమా రెండో రోజు మాత్రం ఏకంగా రూ.24 కోట్ల మేర వసూలు చేసినట్లు తెలుస్తోంది. వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింత పుంజుకునే ఛాన్స్‌ ఉంది. రెండో రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.107 -137 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు సమాచారం. రెండురోజుల్లోనే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం రూ.350 కోట్ల మార్క్‌ను అధిగమించినట్లు తెలుస్తోంది.

                                        

About Author