కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పీకే !?
1 min read

పల్లెవెలుగువెబ్ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించనున్నారన్నసమాచారాన్ని సంబంధిత వర్గాలు ధృవీకరిస్తున్నాయి. పీకే జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయని పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఎన్నికల నిర్వహణ, వ్యూహరచన, పొత్తుల ఖరారు బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశం ఉందని తెలిపారు. పార్టీ పునరుజ్జీవం, పీకే చేరిక, తదితర అంశాలపై సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకతో చర్చించారు.

