NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్ రెడ్డి బాదుడు పోవాలంటే.. చంద్రబాబు రావాలి

1 min read

సుగవాసిప్రసాద్ బాబు,రమేష్ కుమార్ రెడ్డి

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి: జగన్ రెడ్డి బాదుడు పోవాలంటే చంద్రబాబు రావాలని టీటీడీ పాలకమండలి మాజీ సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు రాయచోటి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ శ్రీరమేష్ కుమార్ రెడ్డి గారు పేర్కొన్నారు.మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి మున్సిపాలిటీ లోని 11 వార్డు బేతల్ కాలనీలో  తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బాదుడే బాదుడు కార్యక్రమం  నిర్వహించారు..ఈ సందర్భంగా వారు వార్డులోని ఇల్లు ఇల్లు తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అడ్డదిడ్డంగావసూలు చేస్తున్న పన్నులు అమాంతంగా పెంచుతున్న నిత్యావసర వస్తువుల ధరలు,రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్,డీజల్,విద్యుత్ చార్జీలు,గ్యాస్ ధరలతో సామాన్య ప్రజలు అల్లాడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలా ఎన్నో రకాలుగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న వైసీపీ ప్రభుత్వ అవినీతి,ఆక్రమ,అరాచక పాలన గురించి ప్రజలకు వివరించారు..రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు రావాలన్నారు.ఈకార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాష,టీడీపీ మైనారిటీ నాయకులు మాయాన ఇర్షాద్,టిడిపి పట్టణ అధ్యక్షులు బోనమల ఖాదర్ వలీ,మాజీ కౌన్సిలర్లు రషీద్,సహదేవ,నాగేంద్ర రావుఈశ్వరయ్య,టిడిపి నాయకులు జిలాన్,ఫరూక్,నవాజ్,మస్తాన్, మనోహర్,సుధాకర్,రఫీ,TNSFశివ,నాగేంద్ర, ఆఫ్రోజ్,శ్రీనివాసులు,శరత్, రెడ్డయ్య,బడిశెట్టి రవి,పవన్,జావేద్,మన్నేరు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

About Author