సబ్బం హరి పరిస్థితి విషమం
1 min readపల్లెవెలుగు వెబ్: మాజీ ఎంపీ సబ్బం హరికి కరోన సోకింది. మూడు రోజుల కిందట విశాఖలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స కొనసాగుతోంది. అయితే.. పరిస్థితి విషమించడంతో ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. సబ్బం హరి కాంగ్రెస్, వైసీపీ, టీడీపీల్లో పని చేశారు. సమైక్యాంద్ర ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. సబ్బం హరి ఆరోగ్యం పట్ల ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో సబ్బం హరి విశాఖ ఎంపీగా ఉన్నారు. ఆ సమయంలో రాష్ట్రం విడిపోకూడదని పార్లమెంటులో సబ్బం హరి పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు.